సుల్తానాబాద్ రూరల్, డిసెంబర్ 24 : 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరుగబోయే సమ్మక్క_ సారలమ్మ జాతర కార్యక్రమంలో భాగంగా టెంకాయలు, బెల్లం , లడ్డు పులిహోర ప్రసాదం, పుట్నాలు, పేలాలు అమ్ముకునేందుకు, తలనీలాలు ప్రోగు చేసుకునేందుకు, తల్లి ఆరాధన (కోళ్లు) అమ్ముకునేందుకు ఈనెల 29న పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల మానేటి రంగనాయక స్వామి ఆలయ ఆవరణలో బహిరంగ వేలంపాటను నిర్వహించనున్నట్లు ఈవో శంకరయ్య తెలిపారు.
ఈ సందర్భంగా ఈవో శంకరయ్య మాట్లాడుతూ టెంకాయ లు, బెల్లం కు రూ.20 వేలు, లడ్డు పులిహోర ప్రసాదాని రూ.20 వేలు, పుట్నాలు, పేలాలకు రూ.10 వేలు, తలనీలాలు పోగు చేసుకునేందుకు రూ.20 వేలు, తల్లి ఆరాధన (కోళ్లు) అమ్ముకునేందుకు రూ. 20 వేల దరావత్ ఉంటుందన్నారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు కాలపరిమితి ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు ప్రతీవేలానికి రూ.100 చెల్లించి, షెడ్యూల్ ఖరీదు చేసి, ప్రతి వేలంకు ధరావత్ చెల్లించి వేలంలో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. షరతులు పాటకు ముందు తెలుపనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు కార్య నిర్వహణ అధికారిని సంప్రదించాలని సూచించారు.