Dharmaram | ధర్మారం, డిసెంబర్ 26 : ఇటీవల జాతీయ స్థాయి యోగా పోటీలలో ఛాంపియన్ షిప్ సాధించిన విజేతలకు శుక్రవారం పతంజలి యోగా ఆధ్వర్యంలో సన్మానించారు. నేషనల్ లెవెల్ యోగా ఛాంపియన్ షిప్ – 2025 పోటీలు ఈనెల 21న మంచిర్యాల జిల్లా సోమ గూడెంలో ఇండియన్ యోగ స్కూల్ ప్రొఫెషనల్ యోఫా అసోసియేషన్ నేతృత్వంలో నిర్వహించారు.
ఈ పోటీలలో ధర్మారం పతంజలి యోగా సేవా సమితి నిత్యయోగభ్యాసకులైన బొమ్మవరం వేణు గోపాలరావు, కూరపాటి మల్లేశం, చింతల రాజు ప్రథమ స్థానంలో గెలుపొందగా,ద్వితీయ స్థానంలో కూరపాటి శివరామ్ ప్రసాద్ లు ఛాంపియన్ షిప్ సాధించి విజేతలుగా నిలిచారు. ఈ క్రమంలో పతంజలి యోగా సేవా సమితి, జిల్లా సహా ప్రభారి జంగిలి సుధాకర్, ధర్మారం తాలుకా మహిళా ప్రభారి జంగిలి మంజుల యోగా పతంజలి సభ్యులు విజేతలను సన్మానించారు. వీరికి పతంజలి యువభారత్ రాజ ప్రభారి ముత్యాల రమేష్ అభినందించారు.