E-Shram portal | పెద్దపల్లి, నవంబర్24: ఈ -శ్రమ్ పోర్టల్లో భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులు పేర్లు నమోదు చేసుకోని ప్రభుత్వం అందించే వివిధ సామాజిక భద్రత పథకాలు పొందాలని అదనపు కలెక్టర్ దాసరి వేణు అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని తన చాంబర్లో కార్మిక సామాజిక భద్రత పథకాల పై అవగాహన సదస్సుల పోస్టర్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు.
జిల్లాలోని రెవెన్యూ డివిజన్లలో ఈనెల 24 నుంచి డిసెంబర్ 3 వరకు సామాజిక భద్రతా పథకాలు, ప్రమాద మరణ ఉపశమనం, సహజ మరణ ఉపశమనం, వైకల్య సహాయ పథకం, గ్రూప్ ఇన్సూరెన్స్ పై అవగాహన సదస్సులు జరుగుతాయని చెప్పారు. మరిన్ని వివరాలకు 9492555258 (పెద్దపల్లి), 9492555248 (మంథని), 9492555284 (గోదావరిఖని) ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో పెద్దపల్లి, గోదావరిఖని, మంథని సహాయ కార్మిక అధికారులు, పలు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
అర్జీలను పెండింగ్ పెట్టోద్దు
ప్రజావాణిలో అందిన అర్జీలను పెండింగ్లో పెట్టుకుండా ఎప్పకప్పుడు సమస్యను పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.