Namasthe Telangana – Nipuna | ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సు ఎంచుకోవాలి? వాటి కోసం ఎలా సన్నద్ధం కావాలి? పోటీ పరీక్షలకు ఏవిధంగా సిద్ధం కావాలి? వంటి విషయాల్లో విద్యార్థులకు గైడెన్స్ ఇస్తూ.. కెరీర్లో ముందుకు వెళ్లేందుకు దిక్సూచిగా నిలుస్తోంది నమస్తే తెలంగాణ నిపుణ. ఈ క్రమంలోనే ఇంటర్మీడియట్ తర్వాత ఉన్న ఉద్యోగవకాశాలు ఏంటి? వాటికి ఎలా సిద్ధం కావాలనే దానిపై ఒక చర్చా వేదికను నిర్వహించింది. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో కేఎల్ యూనివర్సిటీ ఈ చర్చావేదికను ఏర్పాటు చేసింది. కరీంనగర్లోని ఆల్పోర్స్ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.