నల్లా పన్ను అస్తవ్యస్తం!
కరీం‘నగరం’లో నల్లా పన్నుల చెల్లింపు అస్తవ్యస్తంగా మారింది. ఆన్లైన్లో ఓ తీరు, రికార్డుల్లో మరో తీరు ఉండడంతో నగరవాసులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. దీనికి తోడు ఈ విభాగం సిబ్బంది తీరుతో పన్నులు చెల్లించేందుకు తిప్పలు పడాల్సి వస్తున్నది. ఆన్లైన్లో బకాయి భారీగా ఉన్నట్టు, రికార్డుల్లో తక్కువగా ఉన్నట్టు చూపుతుండగా, దీనిపై స్పష్టతనిచ్చేవారు కరువయ్యారు. అసలు ఏ పన్ను చెల్లించాలని అడిగినా చెప్పే దిక్కు లేకుండా పోయిందని ప్రజలు వాపోతున్నారు. అసలు నల్లా పన్నులు ఏ మేరకు ఉన్నాయో తెలియడం లేదని ఆవేదన చెందుతున్నారు.
- కరీం‘నగరం’లో ఆన్‌లైన్‌తో అవస్థలు
- ఆన్లైన్లో ఒకలా.. రికార్డుల్లో మరొకలా పన్నులు
- చెల్లింపునకు నగరవాసులకు తిప్పలు
- స్పష్టత ఇచ్చేవారు లేక అయోమయం
- సిబ్బంది తీరుపై విమర్శలు
కరీం‘నగరం’లో నల్లా పన్నుల చెల్లింపు అస్తవ్యస్తంగా మారింది. ఆన్లైన్లో ఓ తీరు, రికార్డుల్లో మరో తీరు ఉండడంతో నగరవాసులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. దీనికి తోడు ఈ విభాగం సిబ్బంది తీరుతో పన్నులు చెల్లించేందుకు తిప్పలు పడాల్సి వస్తున్నది. ఆన్లైన్లో బకాయి భారీగా ఉన్నట్టు, రికార్డుల్లో తక్కువగా ఉన్నట్టు చూపుతుండగా, దీనిపై స్పష్టతనిచ్చేవారు కరువయ్యారు. అసలు ఏ పన్ను చెల్లించాలని అడిగినా చెప్పే దిక్కు లేకుండా పోయిందని ప్రజలు వాపోతున్నారు. అసలు నల్లా పన్నులు ఏ మేరకు ఉన్నాయో తెలియడం లేదని ఆవేదన చెందుతున్నారు.
కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 19 : కరీంనగర్ నగరపాలక సంస్థలో నల్లా పన్నును ఆన్లైన్ చేసే ప్రక్రియ ఐదేళ్ల కిందే మొదలైంది. అయితే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల అది కాస్తా అస్తవ్యస్తంగా మారింది. ఒక ఇంటికి ఒకే నల్లా కనెక్షన్ ఉన్నా ఆన్లైన్లో మాత్రం రెండు నల్లా కనెక్షన్లు ఉన్నట్టు చూపిస్తున్నది. మరి కొన్ని ఇళ్లకు సంబంధించి వారు గతేడాది వరకు నల్లా పన్నులు చెల్లించినా.. ఏళ్ల తరబడిగా బకాయిలున్నట్టు కనిపిస్తున్నది. ముఖ్యంగా ఆన్లైన్ చేసే ప్రక్రియలో సిబ్బంది సరిగ్గా నమోదు చేయకపోవడం వల్లే ఈ సమస్యలు వచ్చాయని గతంలోనే ఇంజినీరింగ్ అధికారులు చెప్పారు.
వాటిని సరి చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో సరి చేయలేకపోయారు. దాంతో ఇప్పుడు నగరవాసుల వద్ద పాస్‌బుక్ గానీ, గతంలో చెల్లించిన రసీదులు గానీ లేకపోతే భారీగా బకాయిలు చెల్లించే పరిస్థితి ఉన్నది. తాము ఎప్పటికప్పుడు నల్లా పన్నులు చెల్లిస్తున్నా ఇంకా భారీగానే బకాయిలు ఉన్నట్టు చూపిస్తున్నదని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిని సరిచేయాల్సిన అధికారులు సాంకేతిక కారణాలు సాకుగా చూపుతున్నారని వాపోతున్నారు. అయితే వీటిల్లోనూ ముడుపులు ఇస్తే అంతా సక్రమమే అన్నట్టు సాగుతుందని ఆరోపిస్తున్నారు.
చెల్లింపుల వద్దా నిర్లక్ష్యమే
ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలో నల్లా పన్ను చెల్లించేందుకు వచ్చే నగరవాసులు పెద్దసంఖ్యలో నగరపాలక సంస్థకు వస్తున్నారు. ఈ సమయంలో సహకరించాల్సిన ఈ విభాగం సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. ముందుగా ఆన్లైన్లో ఉందో లేదో పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు. తర్వాత ఆన్లైన్లో లేకపోయినా భారీగా బకాయిలు ఉన్న రికార్డుల్లో చూసుకోవాలని చెబుతున్నారు. అక్కడకు వెళ్తే గంటల తరబడిగా వేచి ఉన్నా సరైన సమాధానం ఇవ్వకుండా.. ఇప్పుడైతే ఈ యేడాది పన్ను చెల్లించాలని పంపిస్తున్నారు.
పన్ను చెల్లించిన తర్వాత ఆన్లైన్ చేసుకోవడానికి కూడా నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో చెల్లించిన రసీదులు లేకపోతే అక్కడ చూపించిన బకాయి చెల్లించాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో రికార్డుల్లో ఓ పేరు, ఆన్లైన్లో మరో పేరు ఉంటున్నదని వాపోతున్నారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంలో పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

