Citu | కాల్వ శ్రీరాంపూర్, మే 12. ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో హమాలీ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లిలో సీఐటీయూ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు . ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎర్రవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈనెల 20న మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయాల ముందు జరిగే ధర్నాలు హమాలి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కుల్ని ఊడగొట్టి పెట్టుబడిదారులకు లాభం చేకూర్చే విధంగా అనుసరిస్తుందని విమర్శించారు. అనంతరం వెన్నంపల్లి మంగపేట జాఫర్ ఖాన్ పేట గ్రామాల్లో సమ్మెకు సంబంధించిన పోస్టర్లు పంపిణీ చేశారు . కార్యక్రమంలో హమాలీ కార్మికులు పాల్గొన్నారు