Metpally | ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి.. జగిత్యాల ఎస్పీ అశోక్కుమార్
పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులపై జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. మెట్ పల్లి పోలీస్ స్టేషన్ను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Metpally | మెట్ పల్లి : పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులపై జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. మెట్ పల్లి పోలీస్ స్టేషన్ను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించారు. రౌడీ షీటర్లు, నేరస్తులపై నిఘా అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు భద్రత కల్పించడంతో విజిబుల్ పోలీసింగ్ కీలక పాత్ర పోషిస్తుందని, సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాల పూర్తి సమాచారం సిబ్బంది వద్ద ఉండాలన్నారు. గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు జరిగినా పై అధికారులను తక్షణమే సమాచారం ఇవ్వాలని సూచించారు. నేరాలను ముందుగానే అరికట్టే విధంగా ఇంటలిజెన్స్ సేకరణ, బీట్ వ్యవస్థ, రాత్రి పూట పెట్రోలింగ్, వాహన తనిఖీలు, అనుమానిత వ్యక్తులపై నిఘా, సీసీ కెమెరాల వినియోగాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లు, జైలు నుంచి విడుదలైన నేరస్తుల కదలికలపై ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. మాదక ద్రవ్యాల ఆక్రమ రవాణా, విక్రయం. వినియోగంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేయాలని, గంజాయి. డ్రగ్స్, నిషేదిత పదార్థాల ఆక్రమ రవాణాను ఆరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగించాలని ఆదేశించారు. యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గ్రామాలు, విద్యా సంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆన్లైన్ మోసాలు, ఓటీపీ, కేవైసీ, ఫేక్ ఇన్వెస్ట్మెంట్ యాప్లు డిజిటల్ ఆరెస్ట్ వంటి మోసాలపై ప్రజలను ఆప్రమత్తం చేయాలని ఆదేశించారు. రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, ప్రమాదకర డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడపడం, మోడిఫైడ్ సెలెన్సర్లపై చట్టపరమైన చర్యలు కొనసాగించాలని సూచించారు. ఎస్పీ వెంట డీఎస్సీ రాములు, కిరణ్కుమార్ ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

