కరీంనగర్ కార్పొరేషన్, జూలై 13 : కరీంనగర్లోని పలు దవాఖానల బయో వ్యర్థాలపై నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టిపెట్టింది. బల్దియాకు అందిస్తున్న చెత్తలోనే వాటిని కూడా కలుపుతుండడంతో ఇన్చార్జి కమిషనర్ కఠిన చర్యలు మొదలు పెట్టారు. వారం రోజులుగా నగరంలోని అన్ని దవాఖానల్లో పారిశుధ్య అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు పాటించని పలు దవాఖానలకు నోటీసులు అందించడం.. అప్పటికీ తీరు మారకపోతే భారీ జరిమానాలు సైతం విధిస్తున్నారు.
ఇప్పటికే 38 దవాఖానలకు సుమారు 4 లక్షల మేర జరిమానా విధించినట్టు పారిశుధ్య విభాగం అధికారులు తెలిపారు. అందులో భాగంగా శనివారం దవాఖానలపై జరుగుతున్న తనిఖీలను ఇన్చార్జి కమిషనర్, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ పరిశీలించారు. పలు దవాఖానల నుంచి మున్సిపాలిటీకి అందిస్తున్న చెత్తను పరిశీలించగా, అందులో బయో వ్యర్థాలు ఉన్నట్టు గుర్తించి మూడు దవాఖానలకు భారీ స్థాయిలో జరిమానాలు విధించారు. భూంరెడ్డి, కేసీ డయాగ్నోస్టిక్ సెంటర్లకు లక్ష చొప్పున, గంగా దవాఖానకు 50 వేల జరిమానా విధించారు.
నగరంలోని దవాఖానల యాజమాన్యాలు బయో వ్యర్థాలను నిబంధనల మేరకు నిర్వీ ర్యం చేయాలని, చెత్త వాహనాల్లో వేయద్దని ఇన్చార్జి కమిషనర్ ఆదేశించారు. ఇప్పటికే పలు దవాఖానలకు నోటీసులు జారీ చేశామ ని, రెండోసారి పట్టుబడితే జరిమానాలు విధిస్తామని, మూడోసారి రూ.లక్షకు పైగా జరిమా నా విధిస్తామని హెచ్చరించారు. అప్పటికి కూడా తీరు మారకపోతే రిజిస్ట్రేషన్ల రద్దుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో పారిశుధ్య పనులు పూర్తిస్థాయిలో చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
రాంనగర్, బుట్టిరాజారాం కాలనీ లో డెంగీ కేసులు నమోదు కాగా, ఆయా ప్రాం తాల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. చెత్త పేరుకపోకుండా, నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించాలని, ఖాళీ స్థలాల్లో నీరు, చెత్త నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. నీరు నిల్వఉన్న ప్రాంతా ల్లో అయిల్ బాల్స్, గంబూషియా చేపలను విడుదల చేయాలన్నారు. కార్యక్రమాల్లో పారిశుధ్య అధికారులు స్వామి, గట్టు శ్రీనివాస్, నరోత్తం, కుమారస్వామి పాల్గొన్నారు.