కరీంనగర్ కమాన్‌చౌరస్తా, జనవరి 5 : కరీంనగర్‌లోని వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ ముఖ్యఅతిథిగా హాజరు కాగా, డాక్టర్ మౌనిక, సూర గీత న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
రామడుగు మండలం వన్నారం గ్రామానికి చెందిన కే వరలక్ష్మికి మొదటి బహుమతి కింద ఆరు గ్రాముల బంగారం, కరీంనగర్‌కు చెందిన గౌరిశెట్టి రజితకు రెండో బహుమతి కింద మూడు గ్రాముల బంగారం, రుద్రసేని పద్మకు మూడో బహుమతి కింద రెండు గ్రాముల బంగారం అందజేశారు. పోటీలో పాల్గొన్న మహిళలకు కన్సోలేషన్ బహుమతులు ఇచ్చారు. కార్యక్రమంలో కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, డైరెక్టర్లు తాటిపెళ్లి సుభాశ్, రాచమల్ల భద్రయ్య, రామిడి శ్రీనివాస్, పాత కృష్ణమూర్తి, పల్లెర్ల శ్రీనివాస్, పల్లెర్ల రాజకీయం, పల్లెర్ల వేణుగోపాల్, నల్ల మహేందర్, పాల్తపు శ్రీనివాస్, పాల్తపు మల్లికార్జున్, వెంకటేశ్ ఆంజనేయులు పాల్గొన్నారు.