Vemulawada | వేములవాడ, సెప్టెంబర్ 11 : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేస్తూ ముదిరాజులను బీసీ-ఏలోకి మార్చాలని ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు పిట్టల భూమేష్ అన్నారు. వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్‌లో కరపత్రాన్ని శుక్రవారం ఆవిష్కరించి మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ-ఏ లో ఉన్న ఏడు శాతం రిజర్వేషన్ నుండి 15 శాతానికి పెంచి ముదిరాజులను బీసీ-ఏలోకి మార్చాలని అన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ విద్యా ,ఉద్యోగ ,స్థానిక సంస్థలు, చట్టసభల ఎన్నికల్లో కూడా ఏర్పాటు చేయాలని అన్నారు. 50 సంవత్సరాలు దాటిన ముదిరాజు వృత్తి వారికి మత్స్యకారులకు పెన్షన్ ఇవ్వాలన్నారు. ఆదివారం వేములవాడలో ముదిరాజుల భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముదిరాజులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు లక్ష్మణ్, రేగుల రాజ్ కుమార్, నరేష్, పిట్టల వెంకటేష్, పుల్లయ్య, శంకర్, మల్లేష్, పండుగ రాజు, సత్యం తదితరులు పాల్గొన్నారు.