Siricilla | రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, జూన్ 22 : సిరిసిల్ల కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి తన సమస్యను వినిపించేందుకు వచ్చిన ఓ తల్లి, వేచి ఉండే సమయంలో సమయాన్ని వృథా చేయకుండా తన చిన్నారికి సెల్ఫోన్లో పాఠాలు నేర్పిస్తూ కనిపించింది.
అధికారుల వద్దకు వెళ్లే వరకూ ఉన్న ఖాళీ సమయాన్ని చదువుకు వినియోగించడం అక్కడి వారిని ఆకట్టుకుంది. తల్లి చూపిన శ్రద్ధ, చిన్నారి ఆసక్తిగా పాఠాలు నేర్చుకోవడం ‘అమ్మే తొలి గురువు’ అన్న మాటను మరోసారి గుర్తు చేసింది. ప్రజావాణి ప్రాంగణంలో ఈ దృశ్యం అందరి దృష్టిని ఆకర్షించింది.