state-level Kabaddi competitions | చిగురుమామిడి, సెప్టెంబర్ 19: చిగురుమామిడి మండలంలోని చిన్న ముల్కనూర్ ఆదర్శ (మోడల్ స్కూల్) పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పీ వర్ష శ్రీ, జీ శివమణి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ హార్జిత్ కౌర్ తెలిపారు.
ఈ నెల 25 నుంచి 28 వరకు నిర్వహించే 35వ సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో ఆ విద్యార్థుల పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు విద్యార్థినిలు ఎంపిక కావడం పట్ల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు వారిని అభినందించారు.