football competition | ధర్మారం, నవంబర్ 2: ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎన్.తేజస్విని అనే విద్యార్థిని 69వ రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ అండర్ 14 పోటీలకు ఎంపికైంది.
ఈనెల 1న గోదావరిఖనిలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి పోటీల్లో మంచి ప్రతిభను కనభరిచి రాష్ట్ర పోటీలకు ఎంపికయింది. ఈనెల 3 నుండి 5 వరకు వికారాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్ర పోటీలలో సదరు విద్యార్థిని పాల్గొంటుంది. ఈ సందర్భంగా తేజస్విని ప్రిన్సిపాల్ ఈ. రాజ్ కుమార్ వ్యాయామ ఉపాధ్యాయులు బైకనీ కొమరయ్య, మేకల సంజీవరావు అభినందించారు.