జగిత్యాల, జూలై 10 : ఎమ్మెల్సీ ఎల్ రమణ తండ్రి ఎల్జీ రాం ఇటీవల మృతి చెందగా, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం రమణను పరామర్శించారు. జగిత్యాలలోని రమణ ఇంటికి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత ఎల్జీ రాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రమణ కుటుంబ సభ్యులను కలిసి కవిత మాట్లాడారు. ఎల్జీ రాం చేసిన వ్యా పారాలు, నియోజకవర్గ ప్రజలకు ఎల్జీ రాం హెల్త్‌కేర్ ద్వారా అందించిన వైద్య సేవలను ఎల్ రమణను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అక్కడే ఎమ్మెల్యేలు డా. సంజయ్ కు మార్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి సమావేశమయ్యారు. ఆ తర్వాత జడ్పీ చైర్పర్సన్ దావ వసంత క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్సీ కవితను దావ వసంతాసురేశ్ దంపతులు శాలువాతో సన్మానించారు. ఎ మ్మెల్యేలు, ఇతర నా యకులను కూడా సన్మానించారు. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, రాయికల్ మున్సిపల్ వైస్ చైర్మన్ రమాదేవి, నా యకులు మహేశ్, పునుగోటి ప్రశాంతి, స్వర్ణలత, లోక బాపురెడ్డి, రాజేశం గౌడ్ తదితరులున్నారు.