మానకొండూర్, డిసెంబర్ 22: తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే నిరుద్యోగుల సమస్యలపై పెద్దల సభలో గళమెత్తుతానని కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి వీ నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం మానకొండూర్ మండల కేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాల్లో జరిగిన మానకొండూర్ నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు.
తనకు అవకాశమిస్తే రాబోయే రోజుల్లో అల్ఫోర్స్ విద్యా సంస్థల తరఫున యువతకు ఉచిత కోచింగ్ శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ముందుగా స్థానిక అం బేదర్ విగ్రహానికి పూలమాల వేసి భారీ బైక్ ర్యాలీతో కన్వెన్షన్ హాల్‌కు చేరుకున్నారు. కార్యక్రమంలో పట్టభద్రులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.