working journalists | పెద్దపల్లి: పెద్దపల్లిలో ప్రింట్, ఎలక్టానిక్ మీడియా జర్నలిస్టులుగా పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికి విడుతల వారీగా ఇండ్ల స్థలాలను ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటానని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణరావు హామి ఇచ్చారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా కేంద్రం, మండల పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టులంతా కలిసి జేఏసీగా ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విజయరమణారావును ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం కలిసి వర్కింగ్ జర్నలిస్టుల జాబితా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణరావు మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలలో పెద్దపల్లి జిల్లా మండల కేంద్రంగా పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పై సానూకూలంగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జిల్లా ఏర్పాటుకు ముందు నుంచి, జిల్లా ఏర్పాటు తరువాత చాలా సంవత్సరాలుగా జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కోసం ప్రభుత్వాలకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేస్తున్నా పట్టాల పంపిణీకి మాత్రం నోచుకోలేదన్నారు. కానీ తమ ప్రజా ప్రభుత్వం, తాము జర్నలిస్టుల పట్ల సానుకూలంగా ఉన్నామని, పెద్దపల్లి ప్రాంత జర్నలిస్టులకు తప్పకుండా ఇండ్ల స్థలాలను ఇప్పిస్తామన్నారు.
వెంటనే పెద్దపల్లి ఆర్డీవో బొద్దుల గంగయ్యకు ఫోన్ చేసి వారం రోజుల్లో పట్టణంలో ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయో సర్వే నిర్వహించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. అలాగే పట్టణంలో భూమి ఉండి ఇండ్లు నిర్మించుకోవాలనుకునే జర్నలిస్టులకు సైతం ఇందిరమ్మ ఇండ్లు కేటాయించటంతో పాటు, ఇంటి నిర్మాణం కోసం తన వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టులందరూ ఐక్యంగా కలిసి జర్నలిస్టుల సంక్షేమం కోసం కలిసిరావటం సంతోషకరమైన విషయన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు జర్నలిస్టులు వారధిలాగా పనిచేస్తున్నారని, అటువంటి జర్నలిస్టుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల జేఏసీ సభ్యులు కొట్టె సదానందం, బొల్లబత్తుల రాజేందర్, గుడ్ల శ్రీనివాస్, అంకరి ప్రకాశ్, కీర్తి రమేష్, కాల్వ రమేష్, తిర్రి తిరుపతి గౌడ్, పంది కుమార్ యాదవ్ , కొల్లూరి గోపాల్, బానాల రాజమల్లు, బెజ్జంకి నరేష్, ఎర్రోజు వేణుగోపాల్, శిలారపు కిషన్ యాదవ్, కేతిరెడ్డి పవన్, జంజిరాల లక్ష్మణ్, తిర్రి శంకర్, గౌడ్ కత్తెర్ల తిరుపతి యాదవ్, బిర్రు రంజిత్, మర్రి సతీష్‌రెడ్డి, తూర్పాటీ శ్రీనివాస్, తిర్రి సుధాకార్ గౌడ్, నాగపురి తిరుపతి గౌడ్, మధుసుదన్, సాబీర్ పాషా, దుర్గం లక్ష్మణ్, నగిశెట్టి శ్రీనివాస్, రాంబాబు, కొయ్యడ తిరుపతి యాదవ్, వెంటకేష్, మారుపాక అంజి, తోట సతీష్, మాచర్ల వంశీకృష్ణ, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.