గంగాధర, జనవరి 24: పొద్దుపొడుపు కార్యక్రమంలో భాగంగా మండలంలోని ర్యాలపల్లి, కొండాయపల్లి, కాచిరెడ్డిపల్లి, ఇస్లాంపూర్, గంగాధర, మధురానగర్, కురిక్యాల గ్రామాల్లో మంగళవారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పర్యటించారు. ప్రజలను ఆప్యాయంగా పలుకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో 13 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ఎమ్మెల్యే స్వయంగా ఇంటికి వచ్చి చెక్కు అందజేయడం సంతోషంగా ఉందని లబ్ధిదారులు పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సాయం మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు, ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే రవిశంకర్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గర్శకుర్తిలోని మార్కండేయ ఆలయంలో ఎమ్మెల్యే, నాయకులు పూజలు చేశారు.
సింగిల్ విండో చైర్మన్లు దూలం బాలాగౌడ్, వెలిచాల తిర్మల్‌రావు, కొండగట్టు దేవస్థానం బోర్డు డైరెక్టర్ పుల్కం నర్సయ్య, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ పుల్కం గంగన్న, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్‌గోపాల్‌రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, సర్పంచులు పానుగంటి లక్ష్మీనారాయణ, ఆముదాల వెంకటమ్మ, వడ్లూరి అనిత, వేముల లావణ్య, మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, అలువాల నాగలక్ష్మి, జోగు లక్ష్మీరాజం, ఎంపీటీసీలు అట్ల రాజిరెడ్డి, తడిగొప్పుల రజిత, నాయకులు అట్ల శేఖర్‌రెడ్డి, ఆకుల మధుసూదన్, ఆముదాల రమణారెడ్డి, వడ్లూరి ఆదిమల్లు, వేముల అంజి, రామిడి సురేందర్, రేండ్ల శ్రీనివాస్, అలువాల తిరుపతి, తడిగొప్పుల రమేశ్, సముద్రాల అజయ్, దూస అనిల్, పెంచాల చందు, జారతి సత్తయ్య, బెజ్జంకి కల్యాణ్, దోమకొండ మల్లయ్య, అఖిల్, వినోద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.