కరీంనగర్ కార్పొరేషన్, ఏప్రిల్ 19 : బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో నిర్వహిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. శనివారం కరీంనగర్‌లోని కోర్టు రోడ్డులో బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించడంతో పాటు రోడ్డుకు ఇరువైపులా ఉన్న గోడలకు పార్టీ శ్రేణులతో కలిసి అతికించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ నియోజకవర్గం నుంచి వచ్చే వారి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, నాయకులు ఏనుగు రవీందర్‌రెడ్డి, మైకెల్ శ్రీను, ప్రశాంత్‌రెడ్డి, శ్రీకాంత్, తిరుపతినాయక్, సంపత్‌రావు, గుగ్గిళ్ల శ్రీనివాస్, మహేశ్, చేతి చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.