కార్పొరేషన్, జనవరి 19: పురుషులకు దీటు గా మహిళలు రాజకీయాల్లో రాణించాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్‌ను కల్పించిన ఘనత కేసీఆర్ సర్కారుకే ద క్కిందన్నారు. అతివలు ఈ ఫలాలను అందిపుచ్చుకొని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు.
కరీంనగర్ కార్పొరేషన్ కార్యాలయంలో మహిళా కార్పొరేటర్ల కోసం ఏర్పాటు చేసిన చాంబర్‌ను మేయర్ యాదగిరి సునీల్‌రావుతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈసం దర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళల కోసం ప్రత్యేకంగా చాంబర్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మహిళా కార్పొరేటర్లు తమ కు కేటాయించిన గదిలో ప్రజలను కలుసుకోవాలని సూచించారు. ఇక్కడ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, అడిషినల్ కమిషనర్ స్వరూపరాణి, కార్పొరేటర్లు, అధికారులు ఉన్నారు.