జగిత్యాల టౌన్, జనవరి 1 : ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత దొరుకుతుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ తెలిపారు. అయోధ్య శ్రీరాముడి వద్ద పూజలు అందుకున్న అక్షింతలు జిల్లా కేంద్రంలోని అష్టలక్ష్మీ ఆలయానికి చేరుకోగా ఎమ్మెల్యే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, అక్షింతలను శోభాయాత్రగా తీసుకెళ్ళి ఇంటింటికీ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక కల్యాణం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. శ్రీరాముని అక్షింతలను జిల్లా కేంద్రంలోని అన్ని వైష్ణవాలయాల నుంచి భక్తులకు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్ గుగ్గిళ్లపు హరీశ్, బీఆర్ఎస్ నాయకులు ఆవారి గంగాధర్, గంప వేణు, చేని అనిల్, నిర్వాహకులు అశోక్‌రావు, సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.