జగిత్యాల కలెక్టరేట్, డిసెంబర్ 24: ఓవైపు ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్‌కుమార్, మరోవైపు వైద్యుడిగా సాయమూ చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలే తన కుటుంబ సభ్యుల్లా భావిస్తూ ఉచితంగా కంటి వైద్య సేవలు అందిస్తున్నారు.
ఆదివారం జిల్లా కేంద్రంలోని పావని కంటి దవాఖాన, ఆపి, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 12 మంది పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసి కంటి అద్దాలు, మందులు అందజేశారు. శస్త్ర చికిత్స చేయించుకున్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించారు.