హామీలేమైనయ్?
‘గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలు చేసింది. ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించిన్రు. అధికారం వచ్చింది. మరి ఆ హామీలేమైనయ్? సరిగ్గా ఒక్కటి కూడా అమలు చేయలేదు’ అని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కే విద్యాసాగర్‌రావు మండిపడ్డారు.
- కాంగ్రెస్ ఇచ్చినవన్నీ ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలు
- సంక్షేమాన్ని మరిచి గ్రూపురాజకీయాలు
- ప్రభుత్వం ఉంటదో.. ఊడుతదో తెలువదు
- బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కే విద్యాసాగర్‌రావు
జగిత్యాల రూరల్, జూన్ 3: ‘గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలు చేసింది. ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించిన్రు. అధికారం వచ్చింది. మరి ఆ హామీలేమైనయ్? సరిగ్గా ఒక్కటి కూడా అమలు చేయలేదు’ అని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కే విద్యాసాగర్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ సంక్షేమాన్ని మరిచిపోయిందని, ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. గ్రూపు రాజకీయాలతో సతమతమైపోతున్నదని, ప్రభుత్వం ఉంటదా..? ఊడుతదా..? తెలియడం లేదన్నారు.
మంగళవారం జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దశాబ్ధి వేడుకల ముగింపు కార్యక్రమం నిర్వహించగా, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్‌కుమార్, జడ్పీ చైర్మన్ దావ వసంతతో కలిసి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి గులాబీ జెండాను ఎగరేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలుపొందడం శుభపరిణామమన్నారు.
జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమాన్ని చేపట్టి, 13 ఏండ్లు పోరాడి, దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. అధికారం చేపట్టి అభివృద్ధి, సంక్షేమంలో రాష్ర్టాన్ని అగ్రగా మిగా నిలిపి దేశం మొత్తం మనవైపు చేసేలా కృషిచేసిన ఘనత కేసీఆర్‌దేనని గుర్తుచేశారు. అనంతరం జగిత్యాల మాతాశిశు దవాఖానలో పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శం
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శం. పదేళ్లలోనే రాష్ర్టాన్ని దేశంలోనే అగ్ర భాగాన నిలిపిండు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కండ్లలా బీఆర్ఎస్ పాలన సాగింది. పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ ఎంతగానో కృషి చేసిండు. విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట వేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతున్నది. 5లక్షల విద్యా భరోసా హామీపై స్పష్టత ఇవ్వాలి.
– డాక్టర్ సంజయ్‌కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

