Insurance cheque |కాల్వ శ్రీరాంపూర్ ఏప్రిల్ 13. మండలంలోని గంగారం గ్రామ పరిదిలోని ఊషన్నపల్లెకు చెందిన పెండ్లి సంపత్ గత సంవత్సరం కరెంట్ షాక్ తో మృతి చెందాడు. కాగా మృతుని భార్య అనసూర్యకు రూ. లక్ష ప్రమాద బీమా చెక్కును ఎమ్మెల్యే విజయరమణారావు కాల్వశ్రీరాంపూర్ లో ఆదివారం అందించారు. సంపత్ కాల్వశ్రీరాంపూర్ సహకార సంఘంలో క్రాఫ్ లోన్ తీసుకొని బీమా చేయించుకున్నాడు.
కాగా సంపత్ కరంట్ షాక్ కు గురై మృతి చెందడంతో సంఘం ద్వారా మంజూరైన చెక్కును మృతుడి భార్య అనసూర్యకు అందించినట్లు సహకార సంఘం చైర్మన్ చదువు రాంచంద్రారెడ్డి, సీఈవో కోలేటి శ్రీనివాస్ తెలిపారు. బ్యాంకు అకౌంట్ కలిగి ఉన్న రైతులందరూ పీఎం బీమా సురక్షా యోజన ద్వారా రూ.450 చెలిస్తే సాధారణ మరణం వల్ల రూ.2లక్షలు, ప్రమాద బీమా రూ. 4 లక్షలు బీమా అందనున్నట్లు వివరించారు. కావున రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.