ఓదెల, ఫిబ్రవరి 19: రాష్ట్రంలో క్రీడల కు సీఎం కేసీఆర్ తగిన ప్రాధాన్యమిస్తున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఓదెలలో మండ ల స్థాయి క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇందులో ఆదివారం ఓదెల-పొత్కపల్లి జట్లు ఫైనల్ మ్యాచ్ నిర్వహించగా ఓదెల విజేతగా నిలవగా, ద్వితీయ స్థానంలో పొత్కపల్లి జట్టు నిలిచింది. ప్రథమ బహుమతి రూ.10వేలు, ద్వితీయ రూ.5వేల నగదు, కప్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో యువతను కీడ్రల్లో ప్రోత్సహించడానికి గ్రామీణ ప్రాంతాల్లో సైతం క్రీడా ప్రాంగణాలను నెలకొల్పామని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని పథకాలు కేవలం తెలంగాణలోనే అమలు పరుస్తూ ప్రభుత్వం పేదలను ఆదుకుంటున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కునారపు రేణుకాదేవి, బీఆర్ఎస్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షులు ఐరెడ్డి వెంకటరెడ్డి, ఆళ్ల రాజిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ఆకుల మహేందర్, బోడకుంట చినస్వామి, కనికిరెడ్డి సతీశ్, మ్యాడగోని శ్రీకాంత్‌గౌడ్, పోతుగంటి రాజుగౌడ్, పందెన నర్సింగం, పోలోజు రమేశ్, చింతం మొగిలి, తీర్తాల కుమార్, రాచర్ల కుమార్, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.