రుద్రంగి, జూలై 15: కలికోట-సూరమ్మ ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు. రుద్రంగిలోని కలికోట-సూరమ్మ ప్రాజెక్టును సిరిసిల్ల కలెక్టర్సందీప్కుమార్ ఝూ, జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ, కలికోట-సూరమ్మ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా నియోజకవర్గంలో 43వేల ఎకరాలకు సాగునీరు అందిం చే పనుల పురోగతిని పరిశీలించినట్టు తెలిపారు.
రైతులకు నష ్టపరిహారం చెల్లించి కాలువలకు భూసేకరణ జరిపి వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, విప్ అడ్లూరి లక్షణ్‌తో కలిసి ప్రాజెక్టు ఆవశ్యకతను గతంలోనే సీఎం రేవంత్‌రెడ్డి తెలుసుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దార్ శ్రీలత, మాజీ జడ్పీటీసీ గట్ల మీన య్య, మాజీ సర్పంచ్ ప్రభలత పాల్గొన్నారు.
వేములవాడ, జూలై 15: వేములవాడ పట్టణ జనాభాకు అనుగుణంగా అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. అమృత్ 2.0లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు 14 కోట్ల నిధులతో సోమవారం పట్టణంలోని బాలనగర్లో తాగునీటి అవసరాలకు కోసం పనులను కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా, మున్సిపల్ చైర్పర్సన్మాధవితో కలిసి ప్రారంభించారు.
ఇందులో భాగంగా బాలనగర్లో 8లక్షల లీటర్ల సామర్థ్యం గల ఓవర్‌హెడ్ వాటర్‌ట్యాంక్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ ఆర్డీవో రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, తహసీల్దార్ మహేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేశ్, డీఈ తిరుపతి, ఏఈ నర్సింహస్వామి, కౌన్సిలర్లు జోగిని శంకర్, నరాల శేఖర్, నాయకులు పుల్కం రాజు, సుమంత్‌రెడ్డి, సంఘస్వామి, చంద్రగిరి శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
వేములవాడ రూరల్, జూలై 15: మర్రిప ల్లి, ఫాజుల్‌నగర్ రిజర్వాయర్‌ను కలెక్టర్ సం దీప్‌కుమార్ ఝాతో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. మర్రిపల్లి, ఫాజుల్‌నగర్ రిజర్వాయర్ పనులను వీలైనంత తొం దరగా పూర్తి చేయాలని అదేశించారు. అనంతరం రిజర్వాయర్లకు సంబంధించిన మ్యాప్ ను పరిశీలించారు.