విద్యానగర్/ కరీంనగర్ రూరల్/గంగాధర/ మార్చి 15: కరీంనగర్ జిల్లాను అభివృద్ధి లో అగ్రగామిగా నిలుపుతామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కొత్తపల్లిలో 25 ఎకరాల్లో రూ.150 కోట్లతో నిర్మించనున్న మెడికల్ కాలేజీ, మొ గ్దుంపూర్లో జ్యోతీబాఫూలే గురుకుల బాలికల వ్యవసా య కళాశాల, గంగాధర మండలం ఉప్పరమల్యాలలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కలెక్టర్ పమేలా సత్పతి, జడ్పీచైర్‌పర్సన్ విజయతో కలిసి శంకుస్థాపన చేశారు. ఆయాచోట్ల మంత్రి మాట్లాడారు. మెడికల్ కాలే జీ కోసం దీక్ష చేశానని, ఇప్పుడు తానే శంకుస్థాపన చేయ డం ఆనందంగా ఉన్నదన్నారు. ఈ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పా రు.
స్వామినాథన్ స్ఫూర్తితో వ్యవసాయంలో సాంకేతికతపై రైతులకు అవగాహన కల్పించాలని అగ్రీ కాలేజీ విద్యార్థులకు సూచించారు. మాజీ మంత్రి గంగుల కృషితోనే వ్యవసాయ కళాశాల మంజూరైందని, ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటే బాగుండేదన్నారు. రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనుల విషయంలో అందరిని కలుపుకొని పోతామని చెప్పారు. కరువుకు కాంగ్రెస్సో, మరేపార్టో కారణం కాదని, గత సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వర్షాలు కురువకపోవడమేనని పే ర్కొన్నారు. కాగా, మొగ్దుంపూర్లో పలువురు రైతులు పంట లు ఎండిపోతున్నాయని, సాగునీరందించాలని మంత్రి ని కోరారు.
ఇందుకు స్పందిస్తూ ప్రాజెక్టుల్లో నీటి నిల్వల వివరాలను తెలుసుకున్న తర్వాత అధికారికంగా ప్రకటిస్తామన్నారు. తదనంతరం సాగు అవసరాలకు నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కష్టకాలంలో ఉన్న రైతాంగానికి అండగా నిలువాల్సిన బాధ్యత అధికారు లు, ప్రజాప్రతినిధులపై ఉన్నదన్నారు. కార్యక్రమాల్లో కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, ఎంపీపీ పిల్లి శ్రీ లత, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ శీల లక్ష్మీనారాయణ, దవాఖాన సూపరింటెండెంట్ వీరారెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ సుజాత, రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి సైదు లు, కరీంనగర్ ఆర్డీవో మహేశ్, ఈఈ అనిత, బీసీడీవో డీడీ అనిల్, ప్రకాశ్, గ్రామ ప్రత్యేకాధికారి సత్యం, తహసీల్దార్ నవీన్‌కుమార్, ఎంపీవో జగన్మోహన్రెడ్డి, ఎంపీటీసీలు దామరపల్లి పుష్ప, ముద్దం జమున, కాంగ్రె స్ నేతలు పురుమల్ల శ్రీనివాస్, ఆకారపు భాస్కర్‌రెడ్డి, పురుమల్ల మనోహర్, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్ ఉన్నారు.
కొత్తపల్లి, మార్చి 15 : ఖాజీపూర్ (సాయినగర్) గ్రా మంలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ప్రా రంభించారు. ఆయన వెంట ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ పమేలా సత్పతి, ఆర్డీవో కే మహేశ్వర్, ఎంపీపీ పిల్లి శ్రీలతామహేశ్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ గంగాధర్ ఉన్నారు.