మంథని, ఆగస్టు 21: మారుమూల ప్రాంతమైన మంథనిలో డయాలసిస్ సేవలు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. సెంటర్ సేవలను కిడ్నీ బాధితులు వినియోగించుకోవాలని సూచించారు. మంథని ప్రభుత్వ దవాఖానలో ఐదు పడకల డయాలసిస్ సెంటర్‌ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి బుధవారం ప్రారంభించారు.
వైద్య నిపుణులతో మాట్లా డి సెంటర్లోని పరికరాల పనితీరును తెలుసుకున్నారు. డయాలసిస్ సెంటర్ మంజూరు చేసిందుకు సీఎం, డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణలో సింగిల్ యూజ్డ్ ఫిల్టర్ ద్వారా డయాలసిస్ సేవలు అందించడం అభినందనీయమన్నారు. డయాలసిస్ బాధితులకు అవసరమైన మేరకు పరికరాలను అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులకు సూచించారు.
వైరల్ జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో గుంజపడుగులో ప్రత్యేక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలని ఇంటింటికీ సర్వే చేపట్టి అవసరమైన పరీక్షలు నిర్వహించాలని మంత్రి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. ఎంపీ వంశీ కృష్ణ మాట్లాడుతూ మంథనిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయ డం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో మున్సిప ల్ చైర్పర్సన్ రమ, ఆర్డీవో హనుమా నాయక్, డీఎంహెచ్‌వో ప్రమోద్ కుమార్, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ శ్రీధర్, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, నాయకులు ఇనుముల సతీశ్, అయిలి ప్రసాద్, శశిభూషణ్ కాచే, ఒడ్నాల శ్రీనివాస్ ఉన్నారు.