మంథని, నవంబర్ 17: ‘పుట్ట మధు ధైర్యంగా ఉండు.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అంతిమ విజయం మనదే’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారని మంథని బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధూకర్ తెలిపారు.
శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాలకు వచ్చిన కేటీఆర్‌ను పుట్ట మధు కలిశారు. ఆయనకు పూలబోకెను అందజేశారు. ఆనంతరం కేటీఆర్.. మంథని నియోజకవర్గంలో ప్రచార తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. అన్ని సర్వే రిపోర్టులు మీకే అనుకూలంగా ఉన్నాయి.. రోజురోజుకూ ప్రజల మద్దతు పెరుగుతుంది’ అని తనతో చెప్పారన్నారు.