కరీంనగర్: దిగువ కాకతీయ కాలువకు యాసంగి నీటిని మంత్రి గంగుల కమలాకర్ విడుదల చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎల్ఎండి రిజర్వాయర్ దిగువ కాకతీయ కాలువకు ఈ నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్ పూర్తి సామర్ధ్యం 24 టీఎంసీలుకాగా ప్రస్తుతం 22 టీఎంసీల నీరు ఉంది.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు యాసంగి (Yasangi Crops) పంటలకు నీటిని విడుదల చేస్తున్నామని అన్నారు.
సీజన్‌కు సరిపడే విధంగా నీటిని విడుదల చేస్తామని అన్నారు. రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మేయర్ వై సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు.