కరీంనగర్ విద్యానగర్, జూన్ 8 : వర్ధమాన నటి, హీరోయిన్, ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేం మీనాక్షి చౌదరి ఆదివారం కరీంనగర్లో సందడి చేశారు. ఉస్మాన్పుర (గర్ల్స్ కాలేజీ రోడ్)లో కవిత వెడ్డింగ్ మాల్ సెకండ్ బ్రాంచ్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, మాల్ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉందన్నారు.
మీనాక్షి చౌదరి మాట్లాడుతూ, కవిత వెడ్డింగ్ మాల్లో వస్ర్తాలు బాగున్నాయని, అందరికీ అందుబాటు ధరల్లో ఉన్నాయని చెప్పారు. అంతకుముందు షాపు ఎదుట అభిమానులకు అభివాదం చేశారు. డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. కరీంనగర్ ప్రజల అభిమానం ఎప్పటికీ మరిచిపోలేనిదని చెప్పారు.