Gangaram | కాల్వశ్రీరాంపూర్, ఆగస్టు 23 : కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామ మత్స్యశాఖ సహకార సంఘం కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం సభ్యులు తెలిపారు. అధ్యక్షుడిగా మేడి శంకర్, ఉపాధ్యక్షుడిగా ఈర్ల మల్లయ్య, కార్యదర్శిగా నూనే అశోక్, కార్యవర్గ సభ్యులుగా ఈర్ల వెంకటేశ్, కారుపాకల శంకర్, కొలిపాక సదయ్య, దామ రాజేశం, పుట్ట మొగిళి, రానవేన రవీందర్ ఏకగ్రీవమయ్యారు. నూతన కార్యవర్గాన్ని సర్పంచ్ రేకుల జ్యోతి రఘు అభినందించి శాలువాలతో సత్కరించారు. సంఘం అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తామని కార్యవర్గం పేర్కొంది.