Velgatur | వెల్గటూర్, జనవరి 23 : ఎండపల్లి మండలంలో కొత్తపేటలో గల హనుమాన్ దేవాలయంలో సర్పంచ్ జీ రెడ్డి మహేందర్ రెడ్డి, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వసంత పంచమి సందర్భంగా భక్తులకు అక్షరాభ్యాసం చేయడం గొప్ప విషయమన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత చదువులు చదివి, మంచి భవిష్యత్‌ను పొందాలని ఆకాంక్షించారు.
అనంతరం ఆలయ పూజారి గణేశాచార్యులు విద్యార్థులకు ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సింహరాజు లక్ష్మీకాంతం, మాజీ సర్పంచ్ బొమ్మరవేణి రాజేశం, ప్రధానోపాధ్యాయురాలు సూర్యకుమారి, ఐసీడీఎస్ సూపర్వైజర్ ఆండాలు అంగన్వాడీ టీచర్లు రమాదేవి, స్వప్న, నవనీత, పంచాయతీ కార్యదర్శి గోమతి, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు గంగారెడ్డి, గోపాలరావు, యాదగిరి, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.