రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో మార్కండేయ జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం స్థానిక మార్కండేయ దేవాలయంలో శ్రీమార్కండేయస్వామి మహాయజ్ఞం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిపారు. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం మార్కండేయ శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు.
నేతన్న చౌరస్తా, జనవరి24 : రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో మార్కండేయ జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం స్థానిక మార్కండేయ దేవాలయంలో స్వామి మహాయజ్ఞం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిపారు. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. వందలాది మంది పద్మశాలీ బాంధవులు మార్కడేయుండి చిత్రపటాన్ని అలంకరించిన వాహనంపై ఉంచి, ఆలయం నుంచి యాత్ర ప్రారంభించారు. గాంధీనగర్ సర్కిల్, అంబేద్కర్చౌక్, నేతన్న సర్కిల్, పాతబస్టాండ్, పెద్దబజార్, వేంకటేశ్వరాలయం మీదుగా తిరిగి ఆలయానికి చేరుకున్నారు.
డప్పుచప్పుళ్లు మధ్యన నృత్యాలు, కోలాటాలతో ర్యాలీగా వచ్చారు. పిల్లలు ప్రత్యేక వేషధారణలో అలంకరించారు. కార్యక్రమంలో నాస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, కౌన్సిలర్లు, తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం ఉపాధ్యక్షుడు లగిశెట్టి శ్రీనివాస్, పద్మశాలీ సంఘం పట్టణాధ్యక్షుడు గోలి వెంకటరమణ, కార్యదర్శి మండల సత్యం, యువజన సంఘం అధ్యక్షుడు గుండ్లపెల్లి పూర్ణచందర్, పద్మశాలీ సంఘం మహిళా అధ్యక్షురాలు కాముని వనిత తదితరులు పాల్గొన్నారు.