మంథని, అక్టోబర్ 25: ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్సే..ముచ్చటగా మూడోసారి సీ ఎం కేసీఆరే..’ అని మంథని ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి పుట్టమధూకర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సర్వే సంస్థలు, ఇంటెలిజిన్స్ సైతం ఇదే చెబుతున్నాయని అన్నారు. ముత్తారం, కమాన్పూర్లో ఆయా మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశాలను బుధవారం వేర్వేరుగా నిర్వహించారు. కమాన్పూర్లో జరిగిన కార్యక్రమానికి బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఎన్నికల ఇన్ చార్జి ఈద శంకర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్కు ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఆరోపించారు.
తప్పుడు సర్వేలు సృష్టించి విష ప్రచారానికి తెరలేపుతున్నారని మండిపడ్డారు. గ్యా రెం టీ లేని ఆరు పథకాలు, అబద్ధపు మా టలు.. మ ద్యం బాటిళ్లు.. డబ్బు సంచులతో ప్రజలను మభ్య పెట్టేందుకు యత్నిస్తున్నదని విరుచుకుపడ్డారు. మంథని ఎమ్మెల్యే తన దగ్గర డబ్బులు లేవనుకుంటూనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనలో విచ్చలవిడిగా డబ్బు ను ఖర్చు చేశారన్నారు. ఈ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచిన ఆయన విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడని విమర్శించారు. ఏనాడు ఈ ప్రాంత ప్రజల సమస్యలను పట్టించుకోలేదన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండే తనను ప్రజలు ఓటు ద్వారా ఆశీర్వదిస్తే మంథని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు, సా మూహిక వివాహాలు వంటి కార్యక్రమాలకు శ్రీకా రం చుడుతానన్నారు. కార్యకర్తలు 30 రోజుల పా టు సర్కారు సంక్షేమ పథకాలు, తాను నియోజకవర్గంలో చేపట్టి అభివృద్ధి, సంక్షేమం, పుట్ట లింగ మ్మ చారిటబుల్ ట్రస్టు చేసిన సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు.