సిరిసిల్ల రూరల్, నవంబర్ 27: సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ఐడీటీఆర్ తెలంగాణకు మణిహారం లాంటిది అని రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొ న్నా రు. ఈ మేరకు ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులోని ఏర్పాటు చేసిన ఐడీటీఆర్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఐడీటీఆర్‌లో శిక్షణ పొం దుతున్న అభ్యర్థుల వివరాలను స్వయంగా తెలుసుకుని, వారి వివరాలను అడిగి తెలుసుకున్నా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు.
మం త్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో అశోక్ లేలాం డ్ సంస్థ సహకారంతో తెలంగాణలో మొట్ట మొదటి ఐడీటీఆర్‌ను రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఏర్పాటు చేశామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రైవర్లకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని, తెలంగాణలోని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నిపుణులైన డ్రైవర్లుగా సేవలందించాలని కోరారు.
2019 సంవత్సరం కంటే ముందు తాను కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో మంత్రి కేటీఆర్, తాను తెలంగాణలో ఐడీటీఆర్ సంస్థ ఉండాలని భావించామ ని, మంత్రి కేటీఆర్ చొరవతో ఆశోక్ లే లాండ్ సంస్థతో విశాలమైన స్థలంలో అన్ని సదుపాయాలతో ఐడీటీఆర్ ఏర్పాటు చేశామన్నారు. ఐడీటీఆర్ ప్రధాన ఉద్దేశం వాహన చోదకులతో అత్యుత్తమ శిక్షణ అందించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ఐడీటీఆర్‌లో కూడా సిం గరేణి సంస్థ సౌజన్యంతో డ్రైవర్లకు వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.
దీంతోపాటు ఇదివరకే డ్రైవర్లుగా పనిచేస్తున్న వారికి కూడా వైద్యులకు కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ మాదిరిగానే, నిపుణలతో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నా రు. మూడు రోజులు.. 2 రాత్రులు స్వల్పకాలి క శిక్షణ డ్రైవర్లకు అందిస్తే వృత్తి నైపుణ్యాలు మ రింత పెంపొందించుకునేందుకు, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు వీలవుతుందన్నా రు. డ్రైవింగ్‌లో డిప్లమా, సర్టిఫికెట్ కోర్సులు కూడా పెట్టాలని డ్రైవర్ల నుంచి డిమాండ్ వస్తున్న దృష్ట్యా ఆ ఆలోచన చేయాలని ఐడీటీఆర్ బాధ్యులను సూచించారు. తాను కూడా ఉన్నతాధికారుతో మాట్లాడి, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
కార్యక్రమంలో మాజీ ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, డీటీవో కొండల్రావు, ఎంపీపీ పడిగెల మానస, ప్యాక్స్ చైర్మన్లు బండి దేవదాస్ గౌడ్, మెన్నేని నర్సింగరావు, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాట్ల మధు, మండలాధ్యక్షుడు వల్లకొండ వేణుగోపాలరావు, మాజీ ప్యాక్స్ చైర్మన్ పబ్బతి విజేందర్‌రెడ్డి, టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు జక్కుల నాగరాజు, శ్రీనాథ్‌గౌడ్, పడిగెల రాజు, ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, గనప మదన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ పూసపల్లి సరస్వతి, మోర నిర్మల, రేణుక, వాణి, గుర్రం కిషన్, వేముల శ్రీనివాస్, నేరేళ్ల అనిల్‌గౌడ్, కృష్ణభగవాన్, అఫ్రోజ్, కనకరాజు, రాజుతోపాటు తదితరులు ఉన్నారు.