మానేరు రివర్ ఫ్రంట్ ఏడాదిన్నరలోనే పూర్తి
కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అత్యాధునిక ప్రమాణాలతో అత్యంత అద్భుతంగా నిర్మిస్తున్నామని, ఏడాదిన్నరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశమందిరంలో ఆస్ట్రేలియాకు చెందిన లేజర్ విజన్ కంపెనీ,
- అత్యాధునిక ప్రమాణాలతో నిర్మిస్తున్నాం
- కనీవినీ ఎరుగని రీతిలో లేజర్ షో, వాటర్ ఫౌంటెయిన్ ఏర్పాటు చేస్తాం
- మంత్రి గంగుల కమలాకర్
- ఆస్ట్రేలియా కంపెనీ ప్రతినిధులతో కేబుల్ బ్రిడ్జి పరిశీలన
- కలెక్టరేట్లో పవర్‌పాయింట్ ప్రజంటేషన్
కార్పొరేషన్, జూలై 26: కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అత్యాధునిక ప్రమాణాలతో అత్యంత అద్భుతంగా నిర్మిస్తున్నామని, ఏడాదిన్నరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశమందిరంలో ఆస్ట్రేలియాకు చెందిన లేజర్ విజన్ కంపెనీ, ఇండియాలోని ఎఫ్‌పీఏ కంపెనీల ప్రతినిధుల బృందం మానేరు రివర్ ఫ్రంట్‌లో నిర్మించే వాటర్ ఫౌంటెయిన్ లేజర్ షో, థీమ్ థియేటర్‌పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం మానేరు రివర్ ఫ్రంట్ ప్రాంతాన్ని ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందంతో కలిసి క్షేత్రస్థాయిలో మంత్రి పరిశీలించారు. ఈ ప్రాజెక్టులో చేపట్టే వివిధ పనులపై వారికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నామని పేరొన్నారు.
ఇప్పటికే సివిల్ వర్లు ప్రారంభించామని, భారీ వర్షాలు, వరదల వల్ల పనులు మందగించాయని చెప్పారు. రివర్ ఫ్రంట్ పరిసరాలను సుందరీకరించేందుకు పర్యాటక శాఖ నుంచి 100 కోట్లు మంజూరు చేసిందని, వీటితో కనీవినీ ఎరుగని రీతిలో వాటర్ ఫౌంటెయిన్, లేజర్ షో, థీమ్ థియేటర్లు తదితర వాటిని ఏర్పాటు చేస్తామన్నారు. లేజర్, వాటర్ ఫౌంటెయిన్స్కు సంబంధించి అంతర్జాతీయంగా అనేక దేశాల్లో అద్భుతంగా తీర్చిదిద్దిన ఆస్ట్రేలియా ప్రతినిధులతో డీపీఆర్‌ను సిద్ధం చేయిస్తున్నామని, అతి త్వరలోనే టెండర్లు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఆస్ట్రేలియా కంపెనీకి దుబాయ్, మకా, వియత్నాం, హాంకాంగ్, సింగపూర్‌లో ప్రాజెక్టులు చేసిన అనుభవం ఉందన్నారు. అలాగే కేబుల్ బ్రిడ్జిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు లైటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరానికి సరికొత్త శోభ వస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ వై సునీల్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

