Karimnagar | కరీంనగర్: (తెలంగాణ చౌక్) డిసెంబర్ 26 : పద్మశాలీ సంక్షేమ ట్రస్ట్ జిల్లా అధ్యక్షుడు స్వర్గం మల్లేశం పద్మశాలీల సమాజానికి స్ఫూర్తిదాయకమని తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర రాజకీయ విభాగం అధ్యక్షులు వాసాల రమేష్, తెలంగాణ పద్మశాలీ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మెతుకు సత్యం అన్నారు. కరీంనగర్ లోని పద్మశాలీ సంక్షేమ ట్రస్ట్ కళ్యాణమండపంలో స్వర్గం మల్లేశం జన్మ దినం పురస్కరించుకొని ప్రముఖ రచయిత తడక యాదగిరి మల్లేశం జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద కుటుంబంలో జన్మించిన మల్లేశం చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి, అమ్మమ్మ ఇంట్లో పట్టుదలతో చదివి ఉపాధ్యాయుడుగా కొనసాగాడని అన్నారు.
అనతి కాలంలోనే వ్యాపార రంగంలో రాణించి అంచలంచెలుగా ఎదిగి పద్మశాలి సంఘ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. 1984 లో జిల్లాలో పద్మశాలి యువజన సంఘం స్థాపించడంలో కీలక పాత్ర పోషించాలని కొనియాడారు. 40 సంవత్సరాల నుండి పద్మశాలి సంక్షేమ ట్రస్టుకు వివిధ పదవులను అధిరోహించి అధ్యక్షుడిగా విశేష సేవలు అందిస్తున్నారని అన్నారు. పద్మశాలి నిరుపేద విద్యార్థులను హాస్టల్లో చదివిస్తూ ప్రోత్సహిస్తూ సహాయ సహకారాలు అందించి ఎందరినో ఉన్నతంగా రాణించేందుకు దోహదపడినారన్నారు.
వీరి సేవలు అన్ని రంగాల్లో వినియోగించుకోవాలని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలీ సంఘం నేతలు దూడం లక్ష్మీరాజం, ఎలగందుల సత్యనారాయణ, పెంటి లక్ష్మీనారాయణ,చేరాల మల్లిఖార్జున దేవ్, పోలు సత్యనారాయణ, మామిడాల సురేందర్, స్వర్గం రాజేశం, దూడం శ్రీనివాస్, మార్త ప్రకాష్, వోడ్నాల రవీందర్, జక్కని ప్రభాకర్, బుదారపు శ్రీనివాస్, స్వర్గం నర్సయ్య ఎలిగేటి శ్రీనివాస్, దేవసాని పాపన్న, వంగర రవీందర్, మంచికట్ల కోటేశ్వర్, రాజేంద్రప్రసాద్, వేముల చంద్రశేఖర్, గుడిమల్ల శ్రీకాంత్, అల్స నీలయ్య, బొద్దుల లక్ష్మయ్య మల్లికార్జున్, గుండేటి రమేష్, మార్త శ్రీధర్, బొద్దుల ప్రశాంత్ కుమార్, ఉమ్మడి జిల్లాకు చెందిన నాయకులు పాల్గొన్నారు.