సాగునీటి చరిత్రలో మరో అధ్యాయం మొదలైంది. మెట్ట ప్రాంత ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. తరలివచ్చిన గంగమ్మతో మల్కపేట మురిసిపోయింది. ఈ నేలను కాళేశ్వరం నీటితో అభిషేకిస్తానన్న అమాత్యుడు రామన్న హామీ కార్యరూపం దాల్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-9లో భాగంగా నిర్మించిన మల్కపేట రిజర్వాయర్‌లోకి మంగళవారం నిర్వహించిన ఎత్తిపోతల ట్రయల్న్ విజయవంతమైంది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఇంజినీరింగ్ అధికారులు సర్జ్‌ఫూల్‌లో ఉదయం 7.30 గంటలకు ప్రత్యేక పూజలు చేసి రెండో యూనిట్‌ను ప్రారంభించడంతో 130 మీటర్ల ఎత్తునకుగల ప్రాజెక్టులోకి గోదావరి ఎగిసిపడింది. గంటపాటు నిర్వహించిన ట్రయల్న్ సక్సెస్ కావడంతో అధికారయంత్రాంగం హర్షం వ్యక్తం చేయగా, మెట్టను ముద్దాడిన గోదావరిని చూసి ప్రజానీకం సంబురాల్లో మునిగితేలింది.
రాజన్న సిరిసిల్ల, మే 23 (నమస్తే తెలంగాణ)/ కోనరావుపేట : కోనరావుపేట మండలం మల్కపేట వద్ద కాళేశ్వరం-9వ ప్యాకేజీలో నిర్మించిన ప్రాజెక్టు పూర్తి కాగా, అందులోకి నీటిని ఎత్తిపోసేందుకు మంగళవారం అధికారులు నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. సర్జ్‌పూల్ నుంచి 130 మీటర్ల ఎత్తున ఉన్న రిజర్వాయర్‌లో కి రెండో యూనిట్ ద్వారా గోదావరి పరుగులు తీ సింది. ఉదయం 7.30 గంటల నుంచి 8.30 వర కు గంట పాటు ట్రయల్ రన్ కొనసాగింది. త్వర లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రా రంభించేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో దశాబ్దాల స్వప్నం సాకారం కాబోతున్నందుకు మెట్ట ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
1500 కోట్లతో రూపకల్పన
ఎస్సారెస్పీ ద్వారా ఎత్తిపోతల పథకం చేపట్టి సాగునీరు అందించాలని ఇక్కడి మెట్ట ప్రాంత ప్ర జలు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కానీ, నాడు సమైక్య పాలకులు పట్టించుకున్న పా పాన పోలేదు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత మంత్రి కేటీఆర్ గోదావరి జలాలతో మెట్టను అభిషేకిస్తానం టూ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ మేరకు కాళేశ్వ రం 9వ ప్యాకేజీలో ఎత్తిపోతల పథకాన్ని చేర్చా రు. సిరిసిల్ల రామప్ప గుట్టల వరకు ఎదురెక్కి వ చ్చిన గోదావరి జలాలను గంభీరావుపేట మండ లం నర్మాల ఎగువ మానేరు జలాశయంలోకి ఎత్తిపోసే బృహత్తర కార్యక్రమానికి శ్రీ కారం చుట్టా రు. 1500 కోట్లతో భూగర్భ కాలువ, 3 టీఎంసీల రిజర్వాయర్‌ను నిర్మించారు. రామప్పగుట్ట నుంచి మొదలుకొని కోనరావుపేట మండలం మ ల్కపేట వరకు భూగర్భ కాలువ 12.3. కి.మీ పొడవు నిర్మించారు.
టన్నెల్‌కు సుమారు వెయ్యి కోట్లు కాగా, మల్కపేటలోని 3 టీఎంసీల రిజర్వాయర్‌కు సుమారు 500ల కోట్ల వరకు ఖర్చు చేశారు. 130 మీటర్ల లోతులోని సర్జ్‌పూల్ నుంచి 1100 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేందుకు 30 మెగావాట్ల సామర్థ్యం గల రెండు విద్యుత్ మోటర్లను బిగించగా, ఒక్కో మోటర్ 550 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయనున్నది. ఏడు గుట్టలను అనుసంధానం చేస్తూ మల్కపేట రిజర్వాయర్‌ను ని ర్మించారు. 5 కిలోమీటర్ల పొడవు గల ఆరు బండ్లను నిర్మించారు. ఒక్కో బండ్ కిలోమీటర్ పొడ వు ఉంటుంది. సర్జిపూల్ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు 90 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా, 33/11కేవీ విద్యుత్ ప్రత్యేక ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ట్రయల్ రన్ సక్సెస్
మల్కపేట రిజర్వాయర్ పనులు పూర్తి కావడం తో ట్రయల్ రన్ నిర్వహించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ అధికారులు నాలుగు రోజుల పాటు రేయింబవళ్లు శ్ర మించి సక్సెస్ చేశారు. మానేరు రామప్ప గుట్ట నుంచి టన్నెల్ ద్వారా మల్కపేట వద్ద ఉన్న సర్జిపూల్‌కు నాలుగు రోజుల పాటు నీటిని తరలించా రు. నీటి నిల్వ చేసే సర్జ్‌పూల్‌ను 80 మీటర్ల పొడ వు, 20 మీటర్ల వెడల్పు, 40 మీటర్ల ఎత్తుతో ని ర్మించారు. కాగా, మంగళవారం ఉదయం చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, ఈఈ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో మిషన్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఎంఆర్కేఆర్, డబ్ల్యూపీటీఎల్ కోల్‌కతా, బీహెచ్ఈఎల్, కిర్లోస్క ర్ సంస్థల ప్రతినిధులు ట్రయల్న్‌ల్రో భాగస్వాములయ్యారు. సోమవారం రాత్రి నుంచి అన్ని వి భాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పంపుహౌస్‌లో మోటర్లను ప్రారంభించి గోదావరి జలాలను మంగళవారం ఉదయం సరిగ్గా 7.30 గంటలకు మల్కపేట జలాశయంలోకి ఎత్తిపోశా రు. కలెక్టర్ అనురాగ్ జయంతి ట్రయల్ రన్‌పై ఎ ప్పటికప్పుడు ఆరాతీస్తూ సజావుగా జరిగేలా మా ర్గనిర్దేశం చేశారు. 3 టీఎంసీల సామర్థ్యమున్న మల్కపేట రిజర్వాయర్ ప్యాకేజ్-9 కార్యనిర్వహ ణ ఇంజినీర్ గంగం శ్రీనివాస్‌రెడ్డి ట్రయల్ రన్ సమన్వయ బాధ్యతలను చూశారు. మొదటి పం పు సిద్ధం కానందున రెండో పుంపు ద్వారా ట్రయ ల్ రన్ నిర్వహించారు. విజయవంతం కావడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.
లక్ష ఎకరాలకు సాగునీరు
మల్కపేట రిజర్వాయర్ ట్రయల్న్ సక్సెస్ కావడంతో మెట్ట ప్రాంత ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తమ ఆకాంక్షను నెరవేరుస్తున్నందుకు మంత్రి రామన్నను జీవితాంతం రుణపడి ఉంటామంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్ష ఎకరాల పంటకు నీరందనున్నది. మల్కపేట రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా ఎ ల్లారెడ్డిపేట మండలంలోని సింగసముద్రం చెరు వు, గంభీరావుపేట మండలంలోని బట్టల చెరువుల వరకు కాలువ నిర్మాణ పనులు పూర్తయ్యా యి. బట్టల చెరువు నుంచి ఎగువ మానేరు ప్రాజెక్టులోకి కాలువ ద్వారా నీటిని తరలించే పనులు సైతం తుదిదశకు చేరుకున్నాయి. సిరిసిల్ల నియోజకవర్గంలో 64,470 ఎకరాలు, వేములవాడ నియోజకవర్గంలో 31,680 ఎకరాలకు పైగా సా గునీరందనున్నది. అందులో సిరిసిల్ల మండలం లో 8750, ఎల్లారెడ్డిపేట మండలంలో 29,875, గంభీరావుపేట మండలంలో 9,279, ముస్తాబాద్ మండలంలో 9,599, వేములవాడ అర్బన్ మండలంలో 7805, రూరల్ మండలంలో 1000, కోనరావుపేట మండలంలో 22,875, వీర్నపల్లి మండలంలో 6,967ఎకరాలకు సాగునీరందనున్నది. ఇందులో 60వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందడంతోపాటు 26, 150 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కానుంది.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు
– ఎమ్మెల్యే రమేశ్‌బాబు
మల్కపేట ప్రాజెక్టులోకి అధికారులు నీటి ఎత్తిపోతల ట్రయల్న్ నిర్వహించి సక్సెస్ చేయడంతో వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఫోన్లో మాట్లాడా రు. ఎత్తిపోతలతోనే ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని, వేరే మార్గమే లేదని ఉ ద్యమ నాయకుడు, చెన్నమనేని రాజేశ్వర్‌రావు దూర దృష్టితో అప్పుడే చెప్పారని గుర్తు చేశారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా ప్రస్తుత సీఎం కేసీఆర్ ఆచరణ చేసి చూపించారని కొనియాడారు. తెలంగాణ కోటి ఎగరాల మాగాణి అనే నినాదా న్ని నిజం చేస్తున్నారని చెప్పారు. మల్కపేట రిజర్వాయర్‌తో కోనరావుపేటలో 25వేల 694 ఎకరాలు, వేములవాడ పరిధిలో పలు గ్రామాల్లో 5601 ఎకరాలు కొత్త ఆ యకట్టు స్థిరీకరణ కానుండగా, నియోజకవర్గం మొత్తం 50వేల ఎకరాలకు సాగు నీ రందనుందని, ఈ ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతున్నదని ఆనందం వ్యక్తం చేశా రు. ఇప్పటికే ఎల్లంపల్లి నుంచి వేములవా డ, చందుర్తి, రుద్రంగి మండలాల్లో 50 వేల ఎకరాలకు నీరందుతుందని, ఇప్పుడు మరో 30 వేల ఎకరాలకు సాగునీరందడం సంతోషకరమన్నారు. దీంతోపాటు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడం, పండించిన వరిధాన్యాన్ని గ్రా మాల్లోనే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుండడంతో వ్యవసాయం రైతులకు వరం లా మారింధని అభివర్ణించారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో మల్కపేట రిజర్వాయర్ పూర్తి కావడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా ఈ ప్రాంత భూ నిర్వాసితులతోపాటు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.