Karimnagar | తెలంగాణ చౌక్, కరీంనగర్ ఏప్రిల్ 7 : నేతకాని మహర్ హక్కుల సాధన కోసం మంచిర్యాల పట్టణంలో ఈ నెల 20న నిర్వహిస్తున్న నేతకాని మహార్ రాష్ట్ర స్థాయి సమావేశానికి మాల మహానాడు జాతీయఅధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్ మద్దతు ప్రకటించారు. కరీంనగర్ పట్టణంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు.
న్యాయమైన హక్కుల కోసం నేతకాని మహర్ కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్ చేస్తున్న పోరాటం న్యాయమైందన్నారు. మహార్ కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.1000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ చేయడం దళితుల మధ్య విభేదాలు సృష్టించేందుకేనని ఆరోపించారు.
ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ పదవులతో పాటు కార్పొరేషన్ చైర్మన్ ల పదవులలో నేతకాని మహర్ కులస్తులకు సముచిత స్థానం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. రాష్ట్రవ్యాప్తంగా నేతగాని కులస్తులు రాష్ట్రస్థాయి సదస్సులో పాల్గొని సదస్సును జయప్రదం చేయాలని కోరారు.