తిమ్మాపూర్ రూరల్, మార్చి 7: నియోజకవర్గ వ్యాప్తంగా కేసీఆర్ మహిళా బంధు సంబురాలను సోమవారం టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ గ్రామంలో మహిళా ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల్లోని మహిళా సిబ్బందిని సర్పంచ్ కాటిక వినోద, ఎంపీటీసీ కొత్త తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో సత్కరించారు. కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు. తెలంగాణ వచ్చాకే మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం లభిస్తున్నదని గుర్తు చేశారు. కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి, రేణికుంట గ్రామాలకు చెందిన పలువురికి కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరు కాగా, సోమవారం రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్వయంగా లబ్ధిదారుల ఇండ్ల వద్దకే వెళ్లి అందజేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మహిళా బంధులో భాగంగా లబ్ధిదారులకు చెక్కు అందజేసి సెల్ఫీ దిగినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
శంకరపట్నం, మార్చి 7: మహిళా బంధు సంబరాల్లో భాగంగా మండల పరిషత్ కార్యాలయంలో కేశవపట్నం, వంకాయగూడెం గ్రామాలకు చెందిన మహిళా పారిశుధ్య కార్మికులను జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు శాలువాలతో సన్మానించారు. అలాగే ఎంపీటీసీ బొజ్జ కవిత, హోంగార్డు, కల్యాణలక్ష్మి లబ్ధిదారు రజితను సత్కరించారు. స్వీట్లు పంచి పెట్టారు. మక్త గ్రామంలో సర్పంచ్ నెలవేని సుష్మ ఆధ్వర్యంలో మహిళలు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి రాఖీ కట్టారు. గద్దపాక గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గోపు విజయ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థాయి మహిళా అధికారులను సన్మానించారు. కాచాపూర్‌లో సర్పంచ్ కోండ్ర రాజయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పల్లె సంజీవరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఉమ్మెంతల సతీశ్‌రెడ్డి, బొజ్జ కోటిలింగం, గుర్రం రామస్వామి, మహిళా సర్పంచులు, సన్మాన గ్రహీతలు పాల్గొన్నారు.
మానకొండూర్, మార్చి 7: కేసీఆర్ మహిళాబంధు సంబురాల్లో భాగంగా సోమవారం ఎంపీపీ ముద్దసాని సులోచనాశ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని మహిళా ప్రజాప్రతినిధులు, వివిధశాఖల అధికారులు, సిబ్బందికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జడ్పీటీసీ శేఖర్‌గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్‌తోనే మహిళా సాధికారత సాధ్యమని, దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ, మహిళా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, మండల పశువైద్యాధికారిణి, ఐకేపీ సీసీలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజయ్య, ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
చిగురుమామిడి, మార్చి 7: మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద టీఆర్ఎస్ మహిళా విభాగం మండలాధ్యక్షురాలు అందే సుజాత ఆధ్వర్యంలో కేసీఆర్ మహిళా బంధు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య , సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, సర్పంచులు బెజ్జంకి లక్ష్మణ్, బోయిని శ్రీనివాస్, జకుల రవి, ఉప సర్పంచ్ ముకెర పద్మ, ఎంపీటీసీలు పెసరి జమున, మెడబోయిన తిరుపతి, మండల నాయకులు మంకు శ్రీనివాస్ రెడ్డి, ముకెర సదానందం, అందే పోచయ్య, కత్తి స్వామి, అనుమాండ్ల సత్యనారాయణ, పిల్లి వేణు, బోయిని మనోజ్, మండల మహిళా నాయకులు కొమ్మెర మంజుల, ఆకవరం భవాని, గొల్లపల్లి అరుణ, రాధారపు సరోజన, మహంకాళి కొమురయ్య, పెసరి రాజేశం, కల్వల రాజేశ్వర్‌రెడ్డి, అచ్చ రవీందర్, వార్డు సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
గన్నేరువరం, మార్చి 7: మండలంలోని ఖాసీంపేట గ్రామంలో కేసీఆర్ మహిళా బంధు సంబురాల్లో భాగంగా సర్పంచ్ గంప మల్లీశ్వరి, ఎంపీటీసీ ఏలేటి స్వప్నను అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామంలోని కల్యాణ లక్ష్మి లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లిన గ్రామ పంచాయతీ పాలకవర్గం, వారిని శాలువాతో సత్కరించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంప వెంకన్న మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ మహిళా అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బద్దం సంపత్‌రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
మానకొండూర్ రూరల్, మార్చి 7: గంగిపల్లిలో కేసీఆర్ మహిళా బంధు సంబురాల్లో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ శాలిని, ఎంపీటీసీలు రంగు భాస్కరాచారి, సంపత్, ఉప సర్పంచ్ తాళ్లపల్లి సంపత్ గౌడ్, ఎల్ఎస్సీఎస్ వైస్ చైర్మన్ పంజాల శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు ఇడుమాల సంపత్, కార్యదర్శి బండ రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.