మహాత్మా జ్యోతిభాఫూలే జీవితం స్ఫూర్తిదాయకమని, మహనీయుల స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని ప్రజాప్రతినిధులు, అధికారులు పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మహాత్మాజ్యోతిభాపూలే 197వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కరీంనగర్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయం వద్ద జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ ఆర్వీకర్ణన్, మేయర్ వై. సునీల్ రావు, పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు, ఎస్‌యూ వైస్ చాన్సలర్ మల్లేశ్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గంగాధర మండలంలోని మధురానగర్‌లో స్థానిక నాయకులతో కలిసి పూలె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శంకరపట్నం మండలం రాజాపూర్‌లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Karimnagar4
పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో కలెక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణతో కలిసి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. మంథని మండలంలోని గుంజపడుగులో జ్యోతిభా ఫూలే, అంబేద్కర్ విగ్రహాలను పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్లు పుట్ట మధూకర్, జక్కు శ్రీహర్షిణీ రాకేష్, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజలో కలిసి ఆవిష్కరించారు. గోదావరిఖని రాజేశ్ థియేటర్ సమీపంలోని పూలే విగ్రహానికి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పూలమాల వేసి నివాళులర్పించారు.
జగిత్యాల కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, అదనపు కలెక్టర్లు బీఎస్ లత, మంద మకరంద్ పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత పాల్గొని పూలే చిత్ర పటానికి పుల మాల వేసి నివాళులర్పించారు.
రాజన్నసిరిసిల్ల కలెక్టరేట్లో కలెక్టర్ అనురాగ్ జయంతి, రాష్ట్ర పవర్‌లూం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్‌తో కలిసి జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, తదితరులు పాల్గొన్నారు.
శంకరపట్నం : రాజాపూర్‌లో ఫూలే చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నినదిస్తున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
Karimnagar6