వెల్గటూర్, జూన్ 24 : ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసి ఆరుగురిని కరిచి తీవ్రంగా గాయపరిచింది. ఎండపల్లి మండలంలోని గొడిసేలపేటలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో గ్రామంలోని గొడిసెల నర్సమ్మ ఇంటి ఎదుట పని చేసుకుంటుండగా పిచ్చికుక్క అకస్మాత్తుగా ఆమెపై దూకి ముఖానికి గాయం చేసింది. అక్కడ నుంచి వెళ్లి మోకెనపల్లి విజయపై దాడి చేసింది.
అక్కడి నుంచి వెళ్తూ బత్తుల లచ్చయ్య, చీకట్ల పోచయ్య, దొంత నర్సయ్యను తీవ్రంగా గాయపరిచింది. గమనించిన స్థానికులు 108లో జగిత్యాల దవాఖానకు తరలించారు. కాగా, నర్సమ్మ ముఖానికి తీవ్రంగా గాయం కావడంతో ఆమెకు శస్త్రచికిత్స చేశారు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువ కావడంతో జనాలు బయ ట తిరగడానికి జంకుతున్నారు.