Lions Club | కోల్ సిటీ, జూన్ 29: లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం 54వ సంస్థాపన వేడుక వైభవంగా జరిగింది. గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో జరిగిన వేడుకలో 2025-26 సంవత్సరానికి నూతన కార్యవర్గంను ఎన్నుకున్నారు. క్లబ్ అధ్యక్షులు పీ మల్లికార్జున్ అధ్యక్షతన జరిగిన సెమినార్ కు మాజీ గవర్నర్ లయన్ శివ ప్రసాద్ ముఖ్యతిథిగా హాజరై మాట్లాడారు. లయన్స్ క్లబ్ సేవలను మరింత విస్తరించాలన్నారు. గత ఐదు దశాబ్దాలుగా లయన్స్ క్లబ్ సమాజ సేవలో అగ్రభాగాన ఉందంటే అన్ని క్లబ్ సభ్యుల సమష్టి సహకారమే అన్నారు. అందులో రామగుండం లయన్స్ క్లబ్ కు ఉమ్మడి జిల్లాలోనే మంచి గుర్తింపు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.
50 యేళ్లలో ఎక్కడ లేనిది రామగుండం క్లబ్ లో సీనియర్ సభ్యురాలు విజయలక్ష్మీ నాయకత్వంలో మహిళా కార్యవర్గం తమ భుజాన వేసుకొని క్లబ్ సేవలను విస్తృతంగా చేపట్టి ఒక్క ఏడాదిలోనే ఎన్నో అవార్డులు దక్కించుకోవడం గర్వకారణమన్నారు. అనంతరం క్లబ్ సూతన అధ్యక్షులుగా పడ్లకొండ ఎల్లప్పు, కార్యదర్శిగా సారయ్య, కోశాధికారిగా రాజేంద్రకుమార్ చే ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కమిటీని పలువురు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ డిస్ట్రిక్ గవర్నర్ ముద్దసాని ప్రమోద కుమార్, లయన్స్ గంగాధర్, తిలక్ చక్రవర్తి, రామస్వామి, రాజేందర్ తో పాటు అధిక సంఖ్యలో సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.