Mala Mahanadu | తిమ్మాపూర్, సెప్టెంబర్6 : మాల మహానాడు మానకొండూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన లింగం కుమార్ నియామకమయ్యారు. ఈ మేరకు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు కాడే శంకర్ నియామక పత్రాలను అందజేశారు. తన నియమాకానికి కృషి చేసిన అందరికీ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శంకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలుక ఆంజనేయులు, నాయకులు దామెర సత్యం, బొల్లం వెంకటస్వామి, పల్నాటి చంద్రయ్య, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.
రేపు ఎమ్మెల్యే ఆఫీస్ ముట్టడి విజయవంతం చేయాలి
తమకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వానికి నిరసనగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడిని సోమవారం నిర్వహించతలపెట్టామని మాల నాయకులు, కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మాల మహానాడు సంఘ నాయకులు పిలుపునిచ్చారు.