Yellampalli Project | అంతర్గాం, జూలై 30 : కడెం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎగువ క్యాచ్మెంట్ ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీ రవీంద్ర చారి తెలిపారు.
ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ప్రాజెక్టు దిగువన గల గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు, రైతులు, మత్స్యకారులు, గొర్రెల కాపరులు, ఇతరులు నది ఒడ్డుకు లేదా నదీ ప్రవాహ ప్రాంతంలోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.