తెలంగాణచౌక్,జూన్ 22: కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో జన్మించిన ఒడిశాకు చెందిన చిన్నారికి లైఫ్‌టైం ఫ్రీ బస్‌పాస్ ను మంజూరు చేశారు. శనివారం ఆర్ఎం సుచరిత డిప్యూటీ ఆర్ఎంలు భూపతిరెడ్డి, సత్యనారాయణతో కలిసి కరీంనగర్ దవాఖానలో చికిత్స పొందుతున్న చిన్నారి తల్లికి అందజేశారు. ఈ నెల 16న ఒడిశా రాష్ర్టానికి చెందిన కుమారి భర్త దులాతో కలిసి డెలివరీ కోసం సొంతూరికి వెళ్లేందుకు కరీంనగర్ బస్టాండ్‌కు వచ్చారు. బస్సు కోసం ఎదురుచూస్తుండగా కుమారికి పురిటి నొప్పులు వచ్చాయి.
గమనించిన బస్టాండ్‌లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది పురు డు పోయగా పాపకు జన్మనిచ్చింది. ఇటీవల పురుడు పోసిన సిబ్బందిని ఇటీవల ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందించి చిన్నారికి లైఫ్‌టైం ఫ్రీ బస్సు పాస్ అందించాలని ఆదేశించారు. ఈ మేరకు కరీంనగర్ దవాఖానలో చికిత్స పొందుతున్న చిన్నారి తల్లికి ఆర్ఎం సుచరిత బస్‌పాస్‌తో రూ. 14 వేల నగదు, నూతన వస్ర్తాలు అందజేశారు.