Sircilla | సిరిసిల్ల రూరల్, నవంబర్ 27 : చిన్నారుల భవిష్యత్తుకు జీవిత బీమా తోనే ధీమా ఉంటుందని ఎస్బీఐ లైఫ్ సిరిసిల్ల బ్రాంచ్ మేనేజర్ ప్రభాకర్ పేర్కొన్నారు. సిరిసిల్లలోని సిద్ధార్థ పాఠశాలలో చిల్డ్రన్స్ డే పురస్కరించుకొని జీవిత బీమా పై గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించారు.
అనంతరం పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు జ్ఞాపికలను అందించారు. ప్రతీ ఒక్క కుటుంబానికి, చిన్నారికి విద్యార్థులకు జీవిత బీమా ఎంతో అవసరం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ నాగుల సంతోష్, ప్రిన్సిపాల్ మార్టిన్ లూథర్, బిజు, అల్వాల శ్రీనివాస్, లైఫ్ మిత్ర కొండ కార్తీక్, సిబ్బంది విద్యార్థులు ఉన్నారు.