Odela | మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పొత్కపల్లి ఎస్సై సనత్ రెడ్డి
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను ఆదివారం ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొత్కపల్లి ఎస్సై సనత్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు రసాయన పదార్థాలతో తయారు చేసిన వినాయక విగ్రహాలను కాకుండా మట్టి విగ్రహాలనే పూజిద్దామని పేర్కొన్నారు.
Odela | ఓదెల, సెప్టెంబర్ 13 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను ఆదివారం ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొత్కపల్లి ఎస్సై సనత్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు రసాయన పదార్థాలతో తయారు చేసిన వినాయక విగ్రహాలను కాకుండా మట్టి విగ్రహాలనే పూజిద్దామని పేర్కొన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో కలిగే అనర్థాలను వివరించారు. ఇంటింటా, వాడ, వాడలా మట్టి గణపతులను వినియోగించాలని ప్రజలను చైతన్య పరుస్తున్న సదాశయ ఫౌండేషన్ సభ్యులను అభినందించారు.
మట్టితో చేసిన విగ్రహాలైతే నిమజ్జనం సందర్భంగా త్వరగా నీటిలో కలిసిపోతాయి అన్నారు. వాగులు, చెరువులు, కుంటలు కలుషితం కాకుండా స్వచ్ఛంగా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి మెరుగు భీష్మాచారి, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, ఫౌండేషన్ సభ్యులు ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, క్యాతం వెంకటేశ్వర్లు, మెరుగు సారంగం, క్యాతం మల్లేశం, అల్లం సతీష్, వేణు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Odela
- Peddapally
- Police
- Pothkapalli
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు నమోదులో భాగస్వాములు కావాలి’
ప్రజావాణికి స్పందన కరువు
Ar Rahman | అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు.. ‘రామాయణ’ విమర్శలపై ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rajasthan | రోడ్డు నిర్మాణ పనుల్లో కరెంట్ షాక్.. 8 మంది కార్మికులు దుర్మరణం
AP News | కుటుంబ కలహాలతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న తల్లీ, కొడుకు, కోడలు..!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

