Duddilla Sridharbabu | మంథని, జనవరి 12: మంథని పట్టణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సోమవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కలెక్టర్ కోయ శ్రీహర్ష తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశారు. కూచీరాజ్పల్లిలో రూ. 60లక్షతో నిర్మించబోతున్న మున్నూరు కాపు సంఘం, రూ. 10లక్షలతో నిర్మించబోతున్న బస్టాండ్, రూ. 30లక్షలతో నిర్మించబోతున్న ఈద్గా, గంగాపురి వద్ద బోయినిపేట-గంగాపురి బొక్కలవాగులపై రూ. 9.30కోట్లతో నిర్మించబోతున్న వంతెన, రూ. 20లక్షలతో నిర్మించబోతున్న గౌతమి మేషన్ సంఘం(తాపీ మేస్త్రీ సంఘం)భవనం, రూ. 10లక్షలతో నిర్మించబోతున్న బస్టాండ్, రూ. 20లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్, ఎంపీపీఎస్ స్కూల్ ప్రహారీ గోడలకు శంఖుస్థాపన చేశారు. రూ. 45.15 కోట్లతో నిర్మించబోతున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్‌కు భూమిని పరిశీలించారు.
రూ. 30లక్షలతో మల్లెపూల పోచమ్మ, నల్ల పోచమ్మ దేవాలయాల సుంధరీకరణ, సూరయ్యపల్లి రోడ్డు వద్ద రూ. 20లక్షలతో నిర్మించబోతున్న ఖబరస్తాన్ కాంపౌండ్ వాల్, రూ. 25లక్షలతో మధన పోచమ్మ దేవాలయం సుంధరీకరణ పనులకు శంఖుస్థాపనలు చేశారు. రూ. 20లక్షలతో మేర సంఘం, రూ. 20లక్షలతో నాయిబ్రాహ్మణ సంఘం, రూ. 20లక్షలతో పూసల సంఘం, రూ. 20లక్షలతో కుమ్మరి సంఘం, రూ. 20లక్షలతో స్వర్ణకారుల సంఘం, రూ. 20లక్షలతో గౌడ సంఘం, రూ. 30లక్షలతో బ్రాహ్మణ సంఘం, రూ. 40లక్షలతో పద్మశాలి సంఘం, రూ. 20లక్షలతో ఆర్యవైశ్య సంఘం కమ్యూనిటీ హాల్ బ్యాలెన్స్ పనులకు, రూ. 20లక్షలతో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్, రూ. 40లక్షలతో యాదవ కమ్యూనిటీ హాల్, రూ. 40లక్షలతో విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్, డబుల్ బెడ్ రూం ఇళ్ల నుంచి పోచమ్మ వాడ వరకు రూ. 50లక్షలతో సీసీ రోడ్లు, రూ. 50లక్షలతో రిటైర్డు ఉద్యోగుల రీక్రియేషన్ క్లబ్ నిర్మాణం, రూ. 50లక్షలతో మహిళా సంఘం భవనాల నిర్మాణాలకు శంఖుస్థాపనలు చేశారు.
రూ. 40లక్షలతో అయ్యప్ప దేవాలయంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, రూ. 20లక్షలతో హనుమాన్ దేవాలయ సుంధరీకరణ, అయ్యగారి చెరువు నుంచి విలోచవరం వరకు రూ. 299లక్షలతో రోడ్డు నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. అదే విధంగా పలు దేవాలయాలకు రూ. 10లక్షల చొప్పున వినాయక మండపాల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. స్థానిక నృసింహా శివ కిరణ్ గార్డెన్స్‌లో సాయంత్రం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. డివిజన్లోని మంథనిలో-28, ముత్తారంలో-42, రామగిరిలో 27, కమాన్‌పూర్‌లో-24 మంది లబ్ధిదారులకు శ్రీధర్‌బాబు ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు.