Pegadapally | పెగడపల్లి: జగిత్యాల జిల్లా ఆర్ఎంపీ, పీఎంపీ అధ్యక్షుడిగా కుసుమ శంకర్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని భాగ్యరాజా ఫంక్షన్ హాల్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా పెగడపల్లి మండలానికి చెందిన కుసుమ శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు కుసుమ శంకర్ మాట్లాడుతూ ఆర్ఎంపీ, పీఎంపీ సమస్యల పరిష్కారం కోసం తన వంతుగా కృషి చేస్తానని, తనపై ఎంతో నమ్మకంతో అవకాశం కల్పించిన అన్ని మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అందరి సహకారంతో జిల్లాను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.